Blogs
సరదాకి

సరదాకి

K_Hitesh
| 4

                    గొప్ప బుక్

అవి నేను ఐదవ తరగతి చదువుతున్న రోజులు. ఆ రోజు మా టీచర్ మాకు గొప్ప వాళ్ళు, వాళ్ళు వ్రాసిన పుస్తకాల గురించి వివరించింది. అంతా అయిపోయాక మమ్మల్ని భవిష్యత్తులో అన్నిటికన్నా ఏది గొప్ప బుక్ అవుతుంది అని అడిగింది. సరిగ్గా చెప్పిన వాళ్ళకి గిఫ్ట్ కూడా ఇస్తా అని చెప్పింది. వెంటనే క్లాసులో పిల్లలం అందరం ఎవరికి తోచింది వారు చెప్పటం ప్రారంబించాం. అందరూ చెప్పటం అయిపోయాక మా బెంచ్ వంతు వచ్చింది. మా బెంచ్ లో మొత్తం ముగ్గురం కూర్చుంటాం. ఒకరు మార్క్ జెకంబర్గ్(ఇప్పటి ఫేస్ బుక్ సి‌ఈ‌ఓ), ఇంకొకరు జే.కే. రోలింగ్(హ్యారి పోర్టర్ రచయిత) మరియు మూడో వ్యక్తి నేను. మేం ముగ్గురం చాలా మంచి ఫ్రెండ్స్. ఒక్కక్కరం లేచి చెప్పాం. ముందుగా మార్క్ లేచాడు,

మార్క్ జెకంబర్గ్: మేడమ్ నేను భవిష్యత్తులో స్థాపించే ఫేస్ బుక్ అన్నిటికంటే గొప్పది అవుతుంది అని చెప్పాడు.

తరువాత జే.కే. రోలింగ్ లేచింది

జే.కే.రోలింగ్: మేడమ్ భవిష్యత్తులో నేను రాసే హ్యారి పొట్టర్ అన్నిటికంటే గొప్ప బుక్ అవుతుంది అని చెప్పింది.

కానీ నేను మాత్రం లేచి ఏం చెప్పానో తెలుసా....,

నేను: మేడమ్ భవిష్యత్తులో కానీ, గతంలో కానీ, వర్తమానంలో కానీ, ఎప్పుడైనా సరే, అన్నిటికంటే క్రెడిట్ బ్యాలెన్స్ ఉన్న బ్యాంక్ పాస్ బుక్ గొప్ప బుక్ అని చెప్పా.

 

వెంటనే టీచర్ నన్ను క్లాస్ నుంచి బయటకి పంపేసింది. అదే ఆమె నాకు ఇచ్చిన గిఫ్ట్.