నేను ఎవర్ని? 2.0

నేను ఎవర్ని? 2.0

K_Hitesh
K_Hitesh
Jul 12, 2016, 10:59 PM |
2

నేను ఎవర్ని?

అలసిన ప్రయత్నాన్నే కానీ అల్పుడ్ని కాదు

వణికిన ఆకారాన్నే కానీ విశ్వాసం సడలలేదు

బాధపడినంత మాత్రాన

భయపడినట్టు కాదు

రా.... మరో సవాలుకి సిద్దం.

మృత్యువు చుట్టుముట్టినా పట్టు విడువని అభిమాన్యుడి పోరాటం నా సిద్దాంతం

గరళాన్ని గొంతున నిలిపి కూడా ఆనంద తాండవమాడే ఈశ్వర వ్యక్తిత్వం నాకు వికాశ కారణం

కండరాలు కదలకపోయినా కసి చావని స్టేఫెన్ హాకింగ్ కంటి వెలుగు నా కవచకుండలం

ముల్లోకాలను మూడడుగులతో కొలిచిన వామన విన్యాసం నా ప్రయత్నం

తొణకను

బెణకను

తుఫానులా చెలరేగుతా.

ఇంతకీ నేను ఎవరు?

నేను సముద్రాన్ని

సమస్తాన్ని ఆకర్షించేవాడిని

సింహఘర్జన తరువాత అలుముకున్న గంభీర నిశ్శబ్దగమనాన్ని

కాలాన్ని సవరించే వాడిని

గమ్యాన్ని చేధించేవాడిని

 

అసలు నేను ఎవర్ని?... నేనే ఇప్పటి లిఖించబడని చరితాన్ని... రేపటి నివ్వెరపోయే విజయాన్ని.