లవ్ ఇన్స్టిట్యూట్

లవ్ ఇన్స్టిట్యూట్

K_Hitesh
K_Hitesh
Oct 7, 2015, 12:29 AM |
0

 లవ్ ఇన్స్టిట్యూట్

డియర్ ఫ్రెండ్స్,

          నేను వ్రాసిన మొదటి నవల లవ్ ఇన్స్టిట్యూట్ కినిగే.కామ్ లో ప్రచురితమైంది.  ఇది ఒక ప్రేమ కథ. అంతేకాదు కొంత మంది పిచ్చి శాత్రవేత్తలు ఎలా పౌరులపై ఓషద ప్రయోగాలు చేస్తారో కూడా చూపించడం జరిగింది. ప్రపంచం మెచ్చిన సైంటిస్టు, ప్రపంచం తిరిగే యువకుల మధ్య పోరు ఆసక్తికరంగా ఉంటుంది.

లవ్ ఇన్స్టిట్యూట్ ఆహ్వాన పత్రిక:

ఐమోన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లవ్!

మీరు ఎవరినెైనా ప్రేమిస్తున్నారాఆ ప్రేమని వ్యక్తపరచడానికి భయపడుతున్నారా?

లేక ఎవరినెైనా ప్రేమించిఆ అనుభూతుల్ని ఆస్వాదించాలనుకుంటున్నారా?

కాని ఎలా ప్రేమించాలో తెలియటం లేదా?

ప్రేమ గురించి మీకు ఏమన్నా సందేహాలు ఉన్నాయా?

అయితే మీకు ఇదే మా ఆహ్వానం!

మా ఇన్స్టిట్యూట్ కి రండివచ్చి మీ సందేహాలను నివృత్తి చేసుకోండి.

మేము మీకు ప్రేమ గురించి శిక్షణ ఇస్తాం. తద్వారా మిమ్మల్ని ప్రేమించటానికి పూర్తిగా సిద్ధం చేస్తాం. రండి! రారండి!! ఈ మహత్తర అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ప్రేమించటానికి 100% ఎలిజిబిలిటీతో తిరిగి వెళ్ళండి.

ఇది 200% నిజమైన లవ్ ఇన్స్టిట్యూట్.

 

 

మరెందుకు ఆలస్యం? మీరూ లవ్ ఇన్స్టిట్యూట్ లో చేరిపోండి.

 

 కొల్లిపర హితేష్.