ఆధునిక స్త్రీమూర్తి

ఆధునిక స్త్రీమూర్తి

K_Hitesh
K_Hitesh
Nov 6, 2015, 11:42 PM |
2

కలువ రేకు కళ్ళదానా

చలువ రాతి పళ్ళదానా

మబ్బు కురుల సోకుతోటి

హుందాగా నువ్వు వస్తే

ఊపిరి ఆడక ఆయువు స్తంభించిపోదా?

మాటలు రాక నిశబ్దం రాజ్యం చేయదా?

తేనెలు చిలికే నీ పలుకులు

వేయి గొంతుకల భావచిత్రాలు

కీబోర్డ్ పై కదిలే నీ చేతులు

ఆత్మవిశ్వాసానికి ప్రతీకలు

తడబాటు ఎరుగని నీ నడకలు

భవిష్యత్ దర్శన దారులు

అమ్మతనంతో కుటుంబాన్ని లాలిస్తున్నా

అధికారంతో కార్పొరేట్ వరల్డ్ ని శాసిస్తున్నా

నీకు నీవే సాటి అయిన ఓ ఆధునిక స్త్రీమూర్తి అందుకో నా వందనాలు.........