పరువపు లాస్యం

పరువపు లాస్యం

K_Hitesh
K_Hitesh
Nov 9, 2015, 6:31 AM |
11

చిటపట చినుకుల సవ్వడి రాగం

రేపెను నీలో తుంటరి మొహం

ఎగిసే సొగసుల సుమదుర రూపం

చూసే కనులకి చక్కటి వినోదం

 

కిలకిల నవ్వుల తళుకుల వర్ణం

పెంచెను నాలో తపనుల తాళం

తడిసిన మేనున జారిన వర్షం

తెలిపెను నీలో పరువపు లాస్యం

 

నిన్నే చుట్టిన గాలిది భాగ్యం

శ్వాసై పీల్చగా తీరెను విరహం

ప్రేమగా విసిరా అక్షర బాణం

 అందుకో సఖియా ఈ వలపుల గీతం