నేను ఎవర్ని?

నేను ఎవర్ని?

K_Hitesh
K_Hitesh
Nov 25, 2015, 11:39 PM |
2

నేను ఎవర్ని?

ఓటమి చెందిన వాడ్నే కానీ ఓటమిని కాదు.

గమ్య హీనుడినే కానీ గమనం నుంచి నిష్క్రమించలేదు.

పోరాటం ఆపను

పడిపోయిన ప్రతిసారి

మరొక్కసారి అంటా.

మరుభూమిలో మొలకెత్తిన గడ్డి పరకలోని జీవం నాకు ఆదర్శం.

స్థన్యామృతం పొందే వరకు అలుపెరగని పసిపాప ఏడుపు నా యుద్దవ్యూహం.

నిశీధి చీకట్ల ఆయువు తీసే నిరంకుశ వెలుగు కిరణం నా ఆయుధ చిహ్నం.

ఆత్మవిశ్వాసం ఒలకనివ్వని జటాఝూటం నా సంకల్పం.

పిడికిలి వదలను

అడుగులు ఆపను

పరిగెడుతూనే ఉంటా.

ఇంతకీ నేను ఎవరు?

నేను ఆశకు భానిసను

నిరాశ దరిచేరనివ్వని నిస్పృహ విరోధిని

కాళరాత్రికి సయితం అభయం ఇవ్వగల కఠోర తపస్వినీ

కష్టానికి నిర్వచనాన్ని

ఇష్టానికి భహువచనాన్ని

 

అసలు నేను ఎవర్ని?... నేనే ఈ భూమండలంలో అత్యుత్తమ యోధుడిని.