స్వస్వరూపం-విశ్వరూపం

స్వస్వరూపం-విశ్వరూపం

K_Hitesh
K_Hitesh
Dec 13, 2015, 5:58 AM |
7

ఎవరే నేను?.... ఎవరే నేను?..... ఎవరే నే...నూ?

ఎవరే నేను! ఎవరో నేను!!

 

శాంతిభాషల శబ్దం చేసి

కోపమొస్తే ఆయువు తీసి

కలగా మారిన కవితను నేనేలే....

 

సంఘటలని సాధన చేసి

సంభావాలని సాధ్యం చేసి

సంకెళ్ళు తెంపే శక్తిని నేనేలే....

 

మార్పుని కోరే మార్పుని నేనేలే!!!

 

ఎవరే నేను?.... ఎవరే నేను?..... ఎవరే నే...నూ?

ఎవరే నేను! ఎవరో నేను!!

 

సత్యం మరిచిన సంఘం లేదు

తప్పుని దాచని తర్కం లేదు

ఆకలి చేయని పాపం లేదు

విషముని చిమ్మని వినయం లేదు

          సంఘం మరిచిన సత్యం చూశా

          తర్కం దాచిన తప్పుని చేశా

          పాపం చేసి ఆకలి గెలిచా

          వినయం మాటున విషముని చిమ్మా

 

ఎవరే నేను?.... ఎవరే నేను?..... ఎవరే నే...నూ?

ఎవరే నేను! ఎవరో నేను!!

కామం నేను!.... క్రోధం నేను!.... సౌఖ్యం నే...ను!

పంతం నేను! అంతము నేను!!

 

గమ్యం చేరని దారే ఉందా?

యుద్దం చూడని గమనం ఉందా?

మరణం కోరని జీవం ఉందా?

వెలుతురు దాటని చీకటి ఉందా?

          గమ్యం కోసం దారులు మార్చా

          గమనం తోటి యుద్దం చేశా

          జీవం వలచి తీతువు మోశా

          చీకటి చీల్చి వెలుతురు చూశా

 

ఎవరే నేను?.... ఎవరే నేను?..... ఎవరే నే...నూ?

ఎవరే నేను! ఎవరో నేను!!

మంత్రం నేను!.... తంత్రం నేను!.... యంత్రం నే...ను!

ప్రాణం నేను! ప్రేతము నేను!!

 

చప్పుడు చేయని మౌనం లేదు

శోఖం కానీ వరమే లేదు

శిఖరం తాకని కిరణం లేదు

పుడమిని అంటని గగనం లేదు

          మౌనం మధ్యన చప్పుడు చేశా

          వరమే పొంది శోఖము మాపా

          కిరణం లానే శిఖరం తాకా

          పుడమిని అంటగ కిందకి దూకా

 

ఎవరే నేను?

ఎవరో నేను??

స్వస్వరూపం నేను!

 

విశ్వరూపం నేను!!