ఓ సమాజమా చచ్చిపో

ఓ సమాజమా చచ్చిపో

K_Hitesh
K_Hitesh
Dec 16, 2015, 1:57 AM |
3

ఓ సమాజమా చచ్చిపో!

నిన్ను పుట్టించినవాళ్ళని గుర్తించలేనప్పుడు

నిన్ను లాలించినవాళ్ళని ఆదుకోలేనప్పుడు

నిన్ను పోషించివాళ్ళని పట్టించుకోలేనప్పుడు

దారి చూపించిన వాళ్ళ దరికి కూడా వెళ్ళలేనప్పుడు

తప్పటడుగులు సరిచేసి

విద్యాబుద్దులు నేర్పించి

నీ ఎదుగుదలను ఆకాంక్షించి

అలసి సొలసి

గోరుమద్దలు కాడినుంచి నోటి ముద్దులు వరకు అన్నీ అందించి

సర్వం అర్పించి

సంక్షోభ సమయంలో అండగా నిలిచి

మలి వయసులో చేతికర్రగా మారే తను

ఆపదసమయంలో ఆదుకోమని ఆర్దిస్తే.......

చూడనైనా చూడకుండా

చూసినా మనకెందుకని అనుకుంటూ

నిస్సిగ్గుగా, నిర్లజ్జగా

భయంతో పారిపోయి తప్పించుకు వెళ్ళిపోయిన

ఓ సమాజమా నువ్వు బ్రతకడం వ్యర్ధం

అందుకే చచ్చిపో!

నేను నీ వినాశనాన్ని చూడాలి

నీ వినాశనం తర్వాత ఉద్భవించే నవ సమాజాన్ని దర్శించాలి

అక్కడైనా తనకి సర్వరక్షలూ ఉండాలి

అందుకే చచ్చిపో! దయచేసి చచ్చిపో!!

 

(మూడు సంవత్సరాల క్రితం జరిగిన నిర్భయ దారుణానికి నివాళిగా, గంటదాకా ఎవరూ ఆమెని పట్టించుకొనందుకు నిరసనగా)