నను చెంత చేరనివా?

నను చెంత చేరనివా?

K_Hitesh
K_Hitesh
Dec 25, 2015, 2:35 AM |
3

నీ ఓర చూపుతోనే

నను నేనే మరిచిపోయా

నీ వైపు నడిచి వచ్చా

ఆ చూపులోన మత్తు ఉన్నదే

నీ వైపు నన్ను లాగుతున్నదే

ఉప్పెనలా నన్ను తడుపుతున్నదే

 

సఖియా నవ్వే నవ్వు

లోకం చూసే వెలుగు

ఆ వెలుగు తోటి దారి వేసి స్వాగతాలు వల్లించు

మన ప్రేమ పండించు

ప్రేమ పెరిగి వలపు పుట్టి ఊపిర్లు కలవాలి

కోరికలు తీరాలి

ఆలస్యం చాలులే... ఆహ్వానం అందించవే

నాగుండే కొలనులో పువ్వై వికసించవే

నీ అందం అల్లర్లు రేపే

సుగందం ఆశల్ని మోసే

మన బంధం చిరకాలం నిలిచే

సఖియా!..... నను చెంత చేరనివా?