On the Occasion of National Youth Day

On the Occasion of National Youth Day

K_Hitesh
K_Hitesh
Jan 11, 2016, 10:48 PM |
0

విశ్వాసం ఊపిరిగా సాగర చిన్నోడా

ఈ విశ్వంలో వికసించే ప్రతి విజయం నీదేరా....

నమ్మకమే నీ తోడుగా వేసై ప్రతి అడుగును

సాగే ఆ పయనమే లాగును నీ గమ్యము

 

 

మబ్బులు కమ్మినా

నిశి ముసురే పట్టినా

సూర్యుడు ఆగడు

తన వెలుగును ఆపడు!

ఒక్కసారి ఓడినంత గొంతు చించుకుంటూ

గుక్కతిప్పి ఏడుపెందుకు?

తడబాటు ఎరుగని అడుగులు ఎపుడూ

పరుగులు పెట్టలేవు!

ఓటమియే తొలి గెలుపుకి చిహ్నం అదియే నిర్వచనం!!

పడిలేచే అల అంతిమ ధ్యేయం దానికి ఆధారం!!

 

 

యువతా మేలుకో

నీ లక్ష్యం తెలుసుకో

చతురాంగము జీవితం

పోరాటమే శాశ్వతం!

ఒక్క ఎత్తు తప్పుగా వేసినంత చేత

ఆట మధ్యలో ఆపమాకు!

వేశారక పట్టుదలతో కొత్త ఎత్తు వేస్తే

విజయం నీ సొంతం!

గెలుపంటే నువు కోరినదే సాదించుట కాదుకదా!!

 

సంతృప్తే తుది జీవిత లక్ష్యం అది పోరాటమే అవునుకదా!?