నూతన సంవత్సర శుభాకాంక్షలు

Sort:
Avatar of K_Hitesh

నూతనసంవత్సరపు సముద్రంలో ప్రయాణానికై,
కాలమనే అలలపై తేలుతూ....
ఆశల పడవపై పయనిస్తూ
అవకాశాలని తెరచాపగా మార్చి,
గత సంవత్సరపు అనుభవాలని తెడ్డులా ఉపయోగించి
స్వేదాన్ని ఇంధనంగా చేసి,
జ్ఞానమనే దిక్సూచి సాయంతో
కష్టాల సునామీ ముంచెత్తినా కలత చెందక,
బాల సుడిగుండంలో చిక్కుకున్నా భయపడక
ఓటముల పిడుగులు పడ్డా ఓరిమి కోల్పోక,
తుఫానులే ఎదురైనా నమ్మకంతో
కోరిన విజయ తీరాన్ని చేరుకుంటావని ఆశిస్తూ,
నూతన సంవత్సర శుభాకాంక్షలు.

HAPPY NEW YEAR….

Avatar of K_Hitesh

thank you........Laughing