🧠 Who are you in chess? Check out my blog and find out! ♟️Takes just 3 minutes to read... but the insight might stay forever. 👉 Telugu readers – ఎమండి... నా బ్లాగ్‌ని కాస్త చదివి పెట్టండి! 👉 English readers – Curious to know who you are? Read and discover! 👉 Serious readers – You guys can start from the beginning.
నువ్వు ఎక్కడ వెళ్ళిపోయావు?గమనించాలే గాని...పసిపిల్లల చిరునవ్వులో కనిపిస్తావు!చూడాలే గాని...యువత ఆశాలోకంలో దర్శనమిస్తావు!భవిష్యభారత రెక్కల చప్పుడులో వినిపిస్తావు!విజయాన్ని ఆకాంక్షించే ఓటమి పరుగులో,అంతరిక్షాన్ని ఛేదించే మిసైల్ వెలుగులో,స్పురిస్తావు.నువ్వు కోరుకున్న భారతావని ఆవిష్కృతమైన నాడుఆ వెలుగులో కలకాలం జీవించి నిలుస్తావు.....Dr. APJ Abdul Kalam….We Love you… We Miss you…. We Salute you….
చిటపట చినుకుల సవ్వడి రాగం రేపెను నీలో తుంటరి మొహం ఎగిసే సొగసుల సుమదుర రూపం చూసే కనులకి చక్కటి వినోదం కిలకిల నవ్వుల తళుకుల వర్ణం పెంచెను నాలో తపనుల తాళం తడిసిన మేనున జారిన వర్షం తెలిపెను నీలో పరువపు లాస్యం నిన్నే చుట్టిన గాలిది భాగ్యం శ్వాసై పీల్చగా తీరెను విరహం ప్రేమగా విసిరా అక్షర బాణం అందుకో సఖియా ఈ వలపుల గీతం
Avatar of K_Hitesh
K_Hitesh Nov 9, 2015
కలువ రేకు కళ్ళదానా చలువ రాతి పళ్ళదానా మబ్బు కురుల సోకుతోటి హుందాగా నువ్వు వస్తే ఊపిరి ఆడక ఆయువు స్తంభించిపోదా? మాటలు రాక నిశబ్దం రాజ్యం చేయదా? తేనెలు చిలికే నీ పలుకులు వేయి గొంతుకల భావచిత్రాలు కీబోర్డ్ పై కదిలే నీ చేతులు ఆత్మవిశ్వాసానికి ప్రతీకలు తడబాటు ఎరుగని నీ నడకలు భవిష్యత్ దర్శన దారులు అమ్మతనంతో కుటుంబాన్ని లాలిస్తున్నా అధికారంతో కార్పొరేట్ వరల్డ్ ని శాసిస్తున్నా నీకు నీవే సాటి అయిన ఓ ఆధునిక స్త్రీమూర్తి అందుకో నా వందనాలు.........
Avatar of K_Hitesh
K_Hitesh Nov 6, 2015
జై గణేశ జై గణేశ జైజై గణేశ జై గణేశ జై గణేశ మా మాట వినరా మా ఆర్తి కనరా అభయములనోసగే స్వామి ఓ సుముఖః రూప నమో నమః నారాయణుడు వినిపించగా దంతాన్నే గంటంగా చేసే పంచమవేదా విరించి ఓ ఏకదంతః నమో నమః శ్రీ శ్రీనివాస పరమేశ్వర రూప సత్త్వ తమో గుణ ఓ కపిలః నమో నమః మా ప్రార్దనలన్నీ మ్రోసి పాపాలు కడిగే కడుపున దాచి కాచే ఓ లంబోదరః రూప నమో నమః భూతములకైనా ప్రేతములకైనా అధిపతివైన స్వామి ఓ గణాధ్యక్షః నమో నమః విఘ్నాలను తొలగించి విజయాలను అందించే విఘ్న కర్త హర్త స్వామి ఓ విఘ్నరజాః నమో నమః జననానికి నీవేలే మరణానికి నీవే జననమరణాల నడుమ పోషించే ఓ గజాననః నమో నమః సుఖశాంతులు అందించే శ్రీమంగళ రూప కుమారగ్రజా ఓ స్కందపూర్వజాః నమో నమః
నూతనసంవత్సరపు సముద్రంలో ప్రయాణానికై,కాలమనే అలలపై తేలుతూ....ఆశల పడవపై పయనిస్తూఅవకాశాలని తెరచాపగా మార్చి,గత సంవత్సరపు అనుభవాలని తెడ్డులా ఉపయోగించిస్వేదాన్ని ఇంధనంగా చేసి,జ్ఞానమనే దిక్సూచి సాయంతోకష్టాల సునామీ ముంచెత్తినా కలత చెందక,బాధల సుడిగుండంలో చిక్కుకున్నా భయపడకఓటముల పిడుగులు పడ్డా ఓరిమి కోల్పోక,తుఫానులే ఎదురైనా నమ్మకంతోకోరిన విజయ తీరాన్ని చేరుకుంటావని ఆశిస్తూ,నూతన సంవత్సర శుభాకాంక్షలు. HAPPY NEW YEAR….
Avatar of K_Hitesh
K_Hitesh Jan 2, 2015
ఈ దీపావళి రోజు మన విశ్వాసాలు, నమ్మకాలు, ఆలోచనలు మరియు ఆశయాలు టపాసులవెలుగులో విరజిమ్మాలని,పెదాలపై కాకారుకొవోత్తుల చిరునవ్వులు,వదనంలో మతాబుల జీలుగులు,గమ్యం చేరడంలో రాకెట్ వేగం,చిలిపితనంలో చిచ్చుబుడ్డి చిటపటలు,భూమిని ఏలడంలో భూచెక్రపు హుందాతనం,ఓటమిని ఓడించటంలో ఆటంబాంబ్ తెగువ,రావాలని కోరుకుంటూ ధనానికి, ధాన్యానికి ఏ లోటు రాకుండా ఉండాలని ఆశిస్తూ..........మీ అందరికి దీపావళి శుభాకాంక్షలు.A WISH YOU HAPPY DIWALI......
జై గణేశ జై గణేశ జైజై గణేశ జై గణేశ జై గణేశ మా మాట వినరా మా ఆర్తి కనరా అభయములనోసగే స్వామి ఓ సుముఖః రూప నమో నమః నారాయణుడు వినిపించగా దంతాన్నే గంటంగా చేసే పంచమవేదా విరించి ఓ ఏకదంతః నమో నమః శ్రీ శ్రీనివాస పరమేశ్వర రూప సత్త్వ తమో గుణ ఓ కపిలః నమో నమః మా ప్రార్దనలన్నీ మ్రోసి పాపాలు కడిగే కడుపున దాచి కాచే ఓ లంబోదరః రూప నమో నమః భూతములకైనా ప్రేతములకైనా అధిపతివైన స్వామి ఓ గణాధ్యక్షః నమో నమః విఘ్నాలను తొలగించి విజయాలను అందించే విఘ్న కర్త హర్త స్వామి ఓ విఘ్నరజాః నమో నమః జననానికి నీవేలే మరణానికి నీవే జననమరణాల నడుమ పోషించే ఓ గజాననః నమో నమః సుఖశాంతులు అందించే శ్రీమంగళ రూప కుమారగ్రజా ఓ స్కందపూర్వజాః నమో నమః
నా కొత్త ఈ పుస్తకం 'లవ్ ఇన్స్టిట్యూట్' kinige.com లో ప్రచురితమైంది. అందరూ తప్పకుండా కొని చదవండి. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. కొల్లిపర హితేష్. My first ebook ‘Love Institute’ got published in kinige.com. Here is its link: http://kinige.com/book/Love+Institute kollipara hitesh.
Hi friends, ICL 2012 is starting soon.. be alert every one and atleast try to be active in Team matches and Vote Chess games. Thanks.
Avatar of srikrishna143
srikrishna143 Jan 9, 2012