నూతన సంవత్సర శుభాకాంక్షలు

K_Hitesh
K_Hitesh
Dec 31, 2015, 9:30 PM |
2

ఈ నూతన సంవత్సరం మన ఆనందాలు ఆకాశాన్ని అంటాలని

ఆశల ఆనవాలు పట్టి ఆకాంక్షల ఊయల ఊగాలని

కష్టాలని ఎదుర్కునే ధైర్యం, తెగువ

దుఃఖాలని దిగమింగే ఓర్పు, సహనం

చేకూరాలని

సత్యం దర్శించే జ్ఞానం అందాలని

నిత్యం కలహించే మనస్తత్వం పోవాలని

శాంతి వెల్లివిరియాలని

మూఢత్వం మాసిపోయి మూర్ఖత్వం వదిలిపోవాలని

మనిషంటే నమ్మకం

వ్యవస్థ మీద గౌరవం కలగాలని

మానవత్వాన్ని పోషిస్తూ రాక్షతత్వాన్ని తుదముట్టించాలని

దేశాన్ని ప్రేమిస్తూ సమైఖ్యతకై పాటుపడాలని

స్వార్దం లేని సాయం

కల్మషం ఎరుగని కరుణ

భయం లేని భవిష్యత్తు

చిధ్రం కాని విశ్వాసాన్ని ఆహ్వానిస్తూ

మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు....

 

WISH YOU HAPPY NEW YEAR….